ford: డోర్లలో లోపాలు.. 1.34 మిలియన్ ట్రక్కులను వెనక్కి తెప్పిస్తున్న వాహన తయారీ దిగ్గజం ఫోర్డ్

  • లోపాలు సరిచేసేందుకు వాహనాలను వెనక్కి రప్పిస్తున్న ఫోర్డ్
  • గతేడాది కూడా ఇటువంటి సమస్యే తలెత్తిన వైనం
  • 267 మిలియన్ డాలర్ల నష్టం

డోర్లలో లోపాల కారణంగా 1.34 మిలియన్ ఫోర్డ్ సూపర్ డ్యూటీ ట్రక్కులను వెనక్కి పిలిపించాలని వాహన తయారీ దిగ్గజం ఫోర్డ్ నిర్ణయించింది. 2015-17కు చెందిన ఎఫ్-150 ట్రక్కుల్లోని డోర్లలో లోపాలను గుర్తించిన కంపెనీ ఈ మేరకు ఉత్తర అమెరికా నుంచి వాటిని వెనక్కి తెప్పిస్తోంది. డోర్లలోని లోపాలను సరిచేసేందుకు వాటికి వాటర్ షీల్డ్‌లను అమర్చనుంది. ఫలితంగా సంస్థకు 267 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది.

ఈ వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులను వచ్చే నెలలో గుర్తిస్తామని ఫోర్డ్ అధికార ప్రతినిధి ఎలిజబెత్ వీగండ్ తెలిపారు. అయితే విడిభాగాలు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది చెప్పలేదు. డీలర్లు వాటర్ షీల్డ్‌లను అమర్చి, పూర్తిగా పరీక్షించిన తర్వాత వాటిని తిరిగి అప్పగిస్తారని తెలిపారు.

2016 నుంచి ఇప్పటి వరకు ఇదే సమస్యతో 5 మిలియన్ వాహనలను వెనక్కి పిలిపించింది. అయితే ప్రస్తుత సమస్య మాత్రం అది కాదని పేర్కొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News