sai prajwala: హమ్మయ్య... సాయి ప్రజ్వల దొరికింది!

  • చదువుపై ఒత్తిడి పెడుతున్నారని ఆవేదనతో ఇల్లు వీడిన సాయి ప్రజ్వల
  • ఈ నెల 11న ఇల్లు విడిచి వెళ్లిన బాలిక 
  • హైదరాబాదులోని పీర్జాదిగూడలోని హాస్టల్ లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు

నారాయణ విద్యాసంస్థలు చదువుపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నాయని, విద్యార్థులను తీవ్ర క్షోభకు గురి చేస్తున్నాయని పేర్కొంటూ లేఖ రాసి ఈ నెల 11న ఇల్లు విడిచి వెళ్లిన సాయి ప్రజ్వల ఆచూకీ లభ్యమైంది. ఇల్లు విడిచి వెళ్లిన సాయి ప్రజ్వల హైదరాబాదులోని పీర్జాదిగూడలోని హాస్టల్ లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కేవలం చదువులో పెరిగిన ఒత్తిడితోనే ఆమె ఇల్లు విడిచి వెళ్లినట్టు నిర్ధారించారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిపారు. 

sai prajwala
hydarabad
narayana student
  • Loading...

More Telugu News