andaman nicobar islands: అండమాన్ నికోబార్ మిలటరీ స్టేషన్‌లో దీపావళి జరుపుకున్న రక్షణ మంత్రి
- బ్రిచ్‌గంజ్ మిలటరీ స్టేషన్‌లో దీపావళి వేడుకలు
- సైనికుల కుటుంబాలతో ముచ్చటించిన నిర్మలా సీతారామన్
- మంత్రికి గార్డ్ ఆఫ్ ఆనర్ బహూకరించిన బలగాలు
దీపావళి వేడుకలను భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అండమాన్ నికోబార్‌లోని బ్రిచ్‌గంజ్ మిలటరీ స్టేషన్‌లో జరుపుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె అక్కడ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని, అక్కడి సైనికుల కుటుంబాలతో ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో అండమాన్, నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, నావీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషి (రిటైర్డ్), వైస్ అడ్మిరల్ బిమాల్ వర్మ పాల్గొన్నారు. సైనిక బలగాలు ఆమెకు గార్డ్ ఆఫ్ ఆనర్‌ను అందజేశాయి. రక్షణ విధానాల గురించి, కమాండ్ చర్యల గురించి ఆమె ప్రసంగించారు. అలాగే బుధవారం నాడు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. సవాళ్లతో కూడిన పరిసరాలలో దేశ రక్షణ కోసం సైన్యం చేస్తున్న సేవలను మంత్రి కొనియాడుతూ, ఇలాగే దేశరక్షణ కోసం పాటుపడాలని ఆమె ఆకాంక్షించారు.