ramgopal verma: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై మరో ట్వీట్ తో కలకలం రేపిన రాంగోపాల్ వర్మ!

  • ఫేస్ బుక్ లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా పేరుతో పోస్టు పెట్టిన రాంగోపాల్ వర్మ
  • దీపావళి శుభాకాంక్షలు చెబుతూ, వచ్చే ఏడాది దీపావళిని ప్రస్తావించిన వర్మ
  • వచ్చే ఏడాది దీపావళిలో ఎన్టీఆర్ లక్ష్మీ బాంబులు అంటిస్తారని పోస్టు

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన మరో ట్వీట్ కలకలం రేపుతోంది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించిన నాటి నుంచి టీడీపీ నేతలు పలు హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరి హెచ్చరికలకు వర్మ తీరిగ్గా సమాధానాలు చెబుతున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబునాయుడు సూచనల నేపథ్యంలో టీడీపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయని నేపథ్యంలో... దీపావళిని పురస్కరించుకుని వర్మ ఫేస్ బుక్ లో తాజాగా ఒక పోస్టు చేశాడు.

 ఈ పోస్టు సోషల్ మీడియాలో ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది. "ఎన్టీఆర్స్ లక్ష్మి బాంబ్... ఈ దీపావళి సంగతి సరే కాని వచ్చే దీపావళిలో మాత్రం ఎన్టీఆర్ గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి. హ్యాపీ నెక్స్ట్ ఇయర్స్ దివాలి" అంటూ పోస్టు చేశాడు.  

ramgopal verma
ntr
ntr movie
verma ntr movie
fb post
  • Loading...

More Telugu News