dinchak pooja: బిగ్‌బాస్ ఇంట్లోకి ఢించాక్ పూజ‌... వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ!

  • స్ప‌ష్టం చేసిన పూజ‌
  • అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌న్న గాయ‌ని
  • ఇంట్లో ప్ర‌వేశించాక ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాద‌ని హామీ

`దిల్లోంకా షూట‌ర్‌`, `సెల్ఫీ మైనే లేలీ ఆజ్‌` పాట‌లతో ప్రాచుర్యం సంపాదించుకున్న యూట్యూబ్ స్టార్ ఢించాక్ పూజ‌ త్వ‌ర‌లో హిందీ బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్ట‌నుంది. మొద‌టి వైల్డ్‌కార్డ్ ద్వారా ఇటీవ‌ల ఎలిమినేట్ అయిన ప్రియాంక్ శ‌ర్మ‌, పూజలు బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. బిగ్‌బాస్ కార్య‌క్ర‌మానికి ముందే ఢించాక్ పూజ పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాటిలో నిజం లేద‌ని ఆమె తెలిపింది. ఇప్పుడు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ గురించి ఆమెను ప్ర‌శ్నించగా - `అప్పుడు బిగ్‌బాస్ వారు నాకు కాల్ చేశారు. నా పాట నిర్మాణంలో బిజీగా ఉండ‌టంతో ఒప్పుకోలేదు. ఇటీవ‌ల మ‌ళ్లీ వారు న‌న్ను సంప్ర‌దించారు. ఇప్పుడు నా పాట విడుద‌లైంది... దీంతో బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు ఒప్పుకున్నాను` అని చెప్పింది.

ఈ కార్య‌క్ర‌మాన్ని తాను పెద్ద‌గా చూడ‌లేద‌ని, కానీ ఇటీవ‌ల చూసిన కొన్ని ఎపిసోడ్లు త‌న‌కు బాగా న‌చ్చాయ‌ని పూజ వెల్లడించింది. ఇంట్లో ప్ర‌వేశించాక త‌న ప్ర‌వ‌ర్త‌న‌లో ఎలాంటి మార్పు రాకుండా చూసుకుంటాన‌ని ఆమె హామీ ఇచ్చింది. అలాగే బిగ్‌బాస్ ద్వారా త‌న అభిమానుల‌కు మ‌రింత‌గా చేరువ‌య్యే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని, ఈ కార్య‌క్ర‌మానికి ఒప్పుకోవ‌డానికి అది కూడా ఒక కార‌ణ‌మ‌ని పూజ పేర్కొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News