Mersal: హద్దులు మీరిన అభిమానం.. బెంగళూరులో ‘మెర్సల్’ సినిమా థియేటర్లు బంద్!

  • బెంగళూరులో కొట్టుకున్న కన్నడ, తమిళ అభిమానులు
  • ప్రదర్శన నిలిపివేసిన థియేటర్లు
  • పలు వివాదాల నడుమ విడుదలైన సినిమా

హద్దులు మీరిన అభిమానం కారణంగా బెంగళూరులో మెర్సల్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు మూతబడ్డాయి. విజయ్ నటించిన మెర్సల్  పలు వివాదాలు, అడ్డంకుల నడుమ తమిళనాడు, కర్ణాటకలో విడుదల కాగా, అభిమానుల అత్యుత్సాహం వల్ల బెంగళూరులో పలు థియేటర్లలో ప్రదర్శితమవలేదు. తమిళనాడు, కన్నడ అభిమానుల మధ్య జరిగిన గొడవే ఇందుకు కారణమని తెలుస్తోంది.

బెంగళూరులోని ఓ థియేటర్ ఎదుట నిల్చున్న స్థానికుడిపై విజయ్ అభిమానులు దాడి చేయగా, అతడు కన్నడ మద్దతుదారులతో వచ్చి గొడవకు దిగాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. గొడవ కాస్తా చినికి చినికి గాలివానగా మారడంతో సినిమా ప్రదర్శనను థియేటర్లు నిలిపివేశాయి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన మెర్సల్‌లో విజయ్, సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్‌లు నటించారు.

 

Mersal
movie
vijay
kajal agarwal
bangalore
theater
  • Loading...

More Telugu News