trump: యుద్ధానికి సిద్ధమని ట్రంప్ ప్రకటన చేయడం సరికాదు: హిల్లరీ హితవు

  • అగ్రరాజ్యమై ఉండి యుద్ధ ప్రకటనలు చేయడం సరికాదు
  • ఉత్తరకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు
  • ఉత్తరకొరియాతో యుద్ధానికి సిద్ధమని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం సరికాదు

అగ్రరాజ్యమై ఉండి యుద్ధ ప్రకటనలు చేయడం సరికాదని అమెరికా అధ్యక్షుడికి హిల్లరీ క్లింటన్ హితవు పలికారు. ఉత్తరకొరియాతో యుద్ధం వార్తల నేపథ్యంలో దక్షిణకొరియా రాజధాని సియోల్ లో ఆమె మాట్లాడుతూ, ఉత్తరకొరియాతో యుద్ధానికి సిద్ధమని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి ప్రకటనలు ప్రమాదకరమని ఆమె చెప్పారు.

ఉత్తరకొరియా అణు, క్షిపణి పరీక్షలు చేయకుండా నిరోధించడంలో చైనా కీలకపాత్ర పోషించాలని ఆమె కోరారు. ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు, నిబంధనలు విధించి దారిలోకి తీసుకురావాలని ఆమె చైనాకు సూచించారు. ఉత్తరకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం అమెరికాకు లేదని ఆమె స్పష్టం చేశారు. దౌత్యపరమైన చర్చలు జరిపేందుకు ఉత్తరకొరియాను ఒప్పించాలని ఆమె సూచించారు. 

trump
Hillary
comments
south Korea
north Korea
  • Loading...

More Telugu News