#MeToo: పోకిరీలను వణికిస్తోన్న #Metoo ఉద్యమం... యువకుల చేష్టలను వీడియోలతో పాటు బయటపెడుతోన్న అమ్మాయిలు!

  • సోష‌ల్ మీడియాలో #Metoo లో వెల్లువెత్తుతోన్న అమ్మాయిల పోస్టులు
  • అమ్మాయిల అసభ్య వీడియోలు పెడుతోన్న యువకుల సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్
  • #Metooలో అమ్మాయిల పోస్టులపై స్పందిస్తామంటోన్న పోలీసులు

సోష‌ల్ మీడియాలో #Metoo అంటూ ట్యాగ్ ఏర్పాటు చేసి గ‌తంలో తాము ఎదుర్కున్న లైంగిక దాడులను, త‌మ ప‌ట్ల యువ‌కులు ప్ర‌వ‌ర్తించిన తీరును అమ్మాయిలు వివ‌రించి చెబుతోన్న విష‌యం తెలిసిందే. ఎంతో మంది అమ్మాయిలు తాము ఇంత‌వ‌ర‌కు ఎవ‌రికీ చెప్పుకోలేని బాధ‌ల‌ని కూడా ఇందులో చెప్పుకుంటున్నారు. ఈ ఉద్యమం పోకిరీల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తోంది. మరోపక్క, త‌మ బాగోతాన్ని అమ్మాయిలు సోష‌ల్ మీడియాలో బయ‌ట పెడ‌తారేమోన‌ని యువ‌కులు వ‌ణికిపోతున్నారు.

ఈ క్రమంలో #Metoo ద్వారా ఓ యువ‌కుడు చేసిన బాగోతం బ‌య‌ట ప‌డింది. ఆ యువకుడు అమ్మాయిల వీపుపై టచ్ చేసి, ఆ సంద‌ర్భంగా తీసిన వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ యువ‌కుడు ఒక‌టి కాదు, రెండు కాదు, ఇటువంటివి ఏకంగా 144 పోస్టులు చేశాడు. మణిపాల్‌కు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ ఆ వీడియోలు చూసి వాటిని #Metooలో పెట్టింది. అత‌డి పేరు విన‌య్ నా‌య‌ర్ అని పేర్కొంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు పలు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం అతని అకౌంట్‌ను ఆయా వెబ్ సైట్ల నిర్వాహకులు బ్లాక్ చేశారు.

మరోపక్క, #Metoo ఉద్య‌మంపై రాజ‌కీయ నాయకులు, పోలీసులు కూడా స్పందిస్తున్నారు. #Metooలో ఫిర్యాదు చేసినా నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కోల్‌క‌తా పోలీసులు కూడా ప్ర‌క‌టించారు. తాము కూడా బాధితుల‌మేనంటూ చాలా మంది యువ‌తులు చేస్తోన్న పోస్టులను చూసి తాము షాక్‌కు గుర‌య్యామ‌ని తెలిపారు. #Metoo పై స్పందించిన మ‌ధ్యప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ లైంగిక దాడికి గుర‌వుతున్నామ‌ని చెబుతోన్న వారి ఆవేద‌న‌ను అంద‌రూ వినిపించుకోవాల‌ని, వారికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డాల‌ని పిలుపునిచ్చారు.  

  • Loading...

More Telugu News