ys jagan: జగన్ ఖర్చుకు భయపడి.. వైసీపీ నేతలు ఊళ్లు వదలి పారిపోవాలనుకుంటున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర

  • పాదయాత్ర ఖర్చుకు వైసీపీ నేతలు భయపడుతున్నారు
  • ఏపీ పాలిట నరకాసురుడు జగన్
  • బీసీల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం

వైసీపీ అధినేత జగన్ చేపట్టబోతున్న పాదయాత్రపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సెటైర్లు వేశారు. ఆయన పాదయాత్ర ఖర్చును తలచుకుని ఆ పార్టీ నేతలంతా భయపడిపోతున్నారని... ఖర్చు భరించలేక ఊళ్లను వదిలి వెళ్లాలని అనుకుంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలిట జగన్ ఓ నరకాసురుడిలా తయారయ్యారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి నిధులు కూడా రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. బీసీల సంక్షేమం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని... బీసీల గురించి మాట్లాడే హక్కు కేవలం టీడీపీకి మాత్రమే ఉందని అన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతిని కూడా అందిస్తామని చెప్పారు.

ys jagan
ysrcp
ys jagan padayatra
kolli ravindra
ap minister
Telugudesam
andhra pradesh
  • Loading...

More Telugu News