ap dgp: డీజీపీగా సాంబశివరావు పదవీకాలం పొడగింపు.. నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

  • సాంబశివరావు పట్ల ఆసక్తి చూపుతున్న చంద్రబాబు
  • పదవీ కాలం పొడిగింపు కోసం కేంద్ర హోంశాఖ, యూపీపీఎస్సీలకు ఫైల్!
  • పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్ అధికార్లు

ఏపీ డీజీపీ సాంబశివరావు పదవీకాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ లో ముగియనుంది. ఈ క్రమంలో, సాంబశివరావునే డీజీపీగా కొనసాగించాలని పలువురు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

 ఈ నేపథ్యంలో, విదేశీ పర్యటనకు వెళ్లేముందు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ పదవీకాలం ముగింపు అంశం కూడా చర్చకు వచ్చింది. డీజీపీ పోస్ట్ కోసం పలువురు సీనియర్ అధికార్లు పోటీ పడుతున్నారు. అయితే, పనితీరు, సామాజికవర్గం కోణంలో సాంబశివరావు పట్లే సీఎం మొగ్గు చూపారు. పదవీ కాలం పొడిగింపు కోరుతూ కేంద్ర హోంశాఖ, యూపీపీఎస్సీలకు ఫైల్ పంపించాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది.

ap dgp
sambasivarao
chandrababu
ap cm
  • Loading...

More Telugu News