paster: పాస్టర్ ఎబునేజర్ చెరలో ఉన్న ఆడ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగిస్తాం : నన్నపనేని

  • వేధింపుల ఆరోపణల్లో పాస్టర్ ఎబునేజర్
  • 20 మంది పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేసిన ఎబునేజర్
  • దేవుడితో మాట్లాడుతానంటూ మాయమాటలు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో దైవబోధకుడి ముసుగులో పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేస్తూ, లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఎబునేజర్ అరాచకాలపై చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. అమరావతిలో ఆమె మాట్లాడుతూ, జన్నాథపురం వెళ్తానని, ఎబునేజర్ చేతుల్లో మోసపోయిన యువతులను కలుస్తానని ఆమె అన్నారు. ఆ యువతుల సమస్యలు తెలుసుకుని, వారిని తల్లిదండ్రుల చెంతకు చేరుస్తానని అన్నారు. ఎబునేజర్ లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆమె చెప్పారు. కాసేపట్లో ఆమె జగన్నాథపురం చేరుకోనున్నారు.

కాగా, ఎబునేజర్ తాను దేవుడితో మాట్లాడుతానంటూ యువతులను లొంగదీసుకుంటాడని బాధితులు చెబుతున్నారు. తన చెరలో ఉన్న యువతులకు అతను ఏదో ఇస్తాడని, అందుకే అతనిని వారు వదిలి రావడం లేదని అతని భార్య ఆరోపిస్తోంది. వారితో తెరచాటు వ్యవహారాలు నడపడం వల్లే తనను వదిలేశాడని ఆమె వాపోతోంది. 

paster
harassment
jagannathapuram
nannapaneni
  • Loading...

More Telugu News