ys jagan: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వ్యాపారవేత్త శివారెడ్డి

  • అనంతపురం జిల్లా నేత శివారెడ్డి
  • నాపై జగన్ ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్న శివారెడ్డి
  • వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్న వైసీపీ నేత

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వ్యాపారవేత్త వైవీ శివారెడ్డి వైసీపీలో చేరారు. జగన్ ధర్మవరం పర్యటన సందర్భంగా ఆయన తన అనుచరులతో కలసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను జగన్ బస్సుపైకి పిలిపించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీని బలోపేతం చేయడానికి ఆయన తన వంతు కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ, జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని చెప్పారు. పార్టీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో కలసి పని చేస్తానని అన్నారు. 

ys jagan
ysrcp
yv sivareddy
  • Loading...

More Telugu News