utham kumar reddy: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన!

  • రేవంత్, నేను కలసి రాహుల్ ను కలవలేదు
  • నా ఢిల్లీ పర్యటన సాధారణ అంశమే
  • నిన్న రాత్రి హైదరాబాద్ చేరిన ఉత్తమ్

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన రేవంత్... కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించే లోపే రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఈ వార్తలపై స్పందించిన టీకాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తొలుత వాటిని ఖండించారు. అయితే ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఉత్తమ్ నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన వచ్చిన గంట సేపటికే మరో విమానంలో రేవంత్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ చేరికపై ఉత్తమ్ ను ప్రశ్నించగా, ఆయన 'నో కామెంట్' అన్నారు.

 రేవంత్ రెడ్డి, తాను కలసి రాహుల్ తో భేటీ అయ్యామనే వార్తల్లో నిజం లేదని అన్నారు. పార్టీ పనుల్లో భాగంగానే తాను ఢిల్లీ వచ్చానని... రాహుల్ తో భేటీ కూడా సాధారణ అంశమే అని తెలిపారు. మరోవైపు, ఇదే విషయంపై స్పందించిన ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మహా సముద్రంలాంటిదని... ఎవరైనా పార్టీలో చేరవచ్చని అన్నారు.  

utham kumar reddy
tpcc
rahul gandhi
congress
revanth reddy
Telugudesam
  • Loading...

More Telugu News