bollywood: బాలీవుడ్ అంతా కంగ‌నాను వెలేసినా... ఆమిర్ ఆద‌రించాడు!

  • `సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌` స్క్రీనింగ్‌కి కంగ‌నాకు ఆహ్వానం
  • ముకేశ్ అంబానీ ఇంట్లో స్క్రీనింగ్‌
  • కంగనాను మాత్ర‌మే ఆహ్వానించిన ఆమిర్‌

ఈ-మెయిళ్ల వివాదంలో హృతిక్ రోష‌న్ నోరు విప్పిన త‌ర్వాత బాలీవుడ్ మొత్తం కంగ‌నాను దోషిగా చూస్తోంది. ఆమెకు పెద్ద‌గా స్నేహితులు లేక‌పోవ‌డంతో కంగ‌నా ప‌రిస్థితి బాలీవుడ్ నుంచి వెలివేసినట్టుగా మారింది. ఈ వివాదం గురించి మాట్లాడిన‌ యామీ గౌత‌మ్‌, ఫర్హాన్ అక్త‌ర్‌, సోన‌మ్ క‌పూర్‌లు కూడా హృతిక్‌కే మ‌ద్ద‌తు ప‌లికారు. కానీ ఒక్క ఆమిర్ ఖాన్ మాత్రం కంగ‌నాను ఆద‌రించి, మ‌రోసారి మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ అనిపించుకున్నాడు.

ముంబైలోని ముకేశ్ అంబానీ ఇంట్లో `సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌` స్క్రీనింగ్‌కి ఆమిర్‌, కంగ‌నాను ఆహ్వానించాడు. బాలీవుడ్ అంతా సైడ్ చేస్తున్న కంగ‌నాను మాత్ర‌మే ఆహ్వానించి త‌న ఔదార్యాన్ని చాటుకున్నాడు. బాలీవుడ్ మొత్తం కంగ‌నాను వెలివేసిన‌ట్లుగా చూడ‌టం ఆయ‌న‌కు న‌చ్చ‌లేద‌ట‌. అందుకే ఆయ‌న కంగనాను స్క్రీనింగ్‌కి ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం.

bollywood
kangana ranaut
aamir khan
hrithik roshan
issue
controversy
  • Error fetching data: Network response was not ok

More Telugu News