west bengal: క్రికెట్ లో ఇలాంటి ఫీల్డింగ్ ఎన్నడైనా చూశారా?... ఫోటో చూసి చెప్పండి!
- స్లిప్స్ లో 9 మందిని నిలబెట్టారు
- మహ్మద్ షమీ కొత్త ఎత్తుగడ
- సహకరించిన అశోక్ దిండా
- చత్తీస్ గఢ్ తో రంజీలో బెంగాల్ వ్యూహం
- ఇన్నింగ్స్ 160 పరుగుల తేడాతో బెంగాల్ గెలుపు
క్రికెట్ మైదానంలో లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, మిడాఫ్, మిడాన్, స్లిప్స్, సిల్లీ పాయింట్ ఇలా ఎన్నో ఫీల్డింగ్ ప్లేస్ లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ, ఈ ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ మాత్రం వేరు. కీపర్, బౌలర్ మినహాయిస్తే, మిగిలిన 9 మందీ స్లిప్స్ లో నిలుచుండిపోయారు. ఇది అత్యంత అరుదైన ఫీల్డ్ ప్లేస్ మెంట్.
బెంగాల్, ఛత్తీస్ గఢ్ మధ్య రాయిపూర్ లో రంజీ మ్యాచ్ జరుగుతున్న వేళ, బెంగాల్ పేసర్లు మహ్మద్ షమీ, అశోక్ దిండా ఇలా ప్లాన్ గా ఫీల్డింగ్ పెట్టి బౌలింగ్ చేశారు. వారి దెబ్బకు చత్తీస్ గఢ్ 259 పరుగులకు కుప్పకూలింది. అప్పటికే 529 పరుగుల వద్ద డిక్లేర్ చేయడంతో పాటు తొలి ఇన్నింగ్స్ లో చత్తీస్ గఢ్ 110 పరుగులకే అవుట్ కావడంతో బెంగాల్ ఇన్నింగ్స్ 160 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఇక స్లిప్స్ లో 9 మందిని నిలబెట్టి బౌలింగ్ చేస్తున్న ఫొటోను షమీ పంచుకున్నాడు. మీరూ చూడండి!