raja the great: సూర్యాపేటలో అభిమానుల వీరంగం... 'రాజా ది గ్రేట్' బెనిఫిట్ షో వెయ్యలేదని ధియేటర్ లో విధ్వంసం!

  • రవితేజ, మెహరీన్ జంటగా నటించిన 'రాజా ది గ్రేట్'
  • బెనిఫిట్ షో వేస్తామని ముందుగా డబ్బులు వసూలు చేసిన తేజ మూవీ మ్యాక్స్ థియేటర్
  • బెనిఫిట్ షో వేయకపోవడంతో ప్రేక్షకుల ఆగ్రహం

 'రాజా ది గ్రేట్' సినిమా సూర్యాపేటలో కలకలం రేపింది. పట్టణంలోని తేజ మూవీ మ్యాక్స్ థియేటర్‌ లో 'రాజా ది గ్రేట్' సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షో వేస్తామని ధియేటర్ యాజమాన్యం ప్రేక్షకుల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేసింది. చెప్పినట్టుగా బెనిఫిట్ షో వేయలేదు.

దీంతో ఆగ్రహానికి గురైన ప్రేక్షకులు ధియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మరింత ఆగ్రహానికి గురైన ప్రేక్షకులు ధియేటర్ లోపలికి చొచ్చుకెళ్లి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దీంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

raja the great
raviteja
mehreen
benefit show
movie
  • Loading...

More Telugu News