chandrababu: షటప్.. డోంటాక్.. చేతులు చూపించి మాట్లాడతావా?: డిప్యూటీ సీఎం కేఈ

  • ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?
  • చంద్రబాబు తర్వాత అంతటివాడిని
  • సారా తాగొచ్చిన నాయాళ్లతో కలసి గొడవ చేస్తావా?

ఎప్పుడూ కూల్ గా ఉండే ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి కోపం వచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరులో నిన్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కేఈ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు రైతు రుణమాఫీ కాలేదంటూ ఓ రైతు ఆయనను నిలదీశారు. దీంతో, ఆయనలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

'షటప్.. డోంటాక్.. చేతులు చూపిస్తూ మాట్లాడతావా?' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  "సారా తాగొచ్చిన నాయాళ్లతో కలసి గొడవ చేస్తావా? ఫ్యాక్షన్ గ్రామాల్లో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడితే కుదరదు. మీ కోసం పనులు చేయడానికే ఇక్కడకు వచ్చా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా. డిప్యూటీ సీఎంతో... ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తిని నేను" అంటూ మండిపడ్డారు. 1978లో డోన్ నుంచి ఇందిరా కాంగ్రెస్ తరపున పోటీ చేశానని... చంద్రబాబు కూడా అదే సంవత్సరం అదే పార్టీ నుంచి పోటీ చేశారని... ఆ తర్వాత ఇద్దరం టీడీపీలో చేరామని చెప్పారు.

chandrababu
ap cm
ke krishna murthy
ap deputy cm
intintiki Telugudesam
  • Loading...

More Telugu News