rajastan: అక్రమ సంబంధం ఆరోపణలు రాగానే.. ఊహించని పని చేసిన బాబా!

  • తనను తాను దైవంగా ప్రకటించుకున్న సంతోష్ దాస్ బాబా
  • అతను దొంగ బాబా అని, స్థానిక మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించిన ఇరుగు, పొరుగువారు
  • ఆవేదనతో జననాంగం కోసుకున్న బాబా

తనను తాను దైవంగా ప్రకటించుకున్న బాబా ఊహించని పని చేసి తనపై ఆరోపణలు చేసిన వారిని విభ్రాంతికి గురి చేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని తారానగర్ లో సంతోష్ దాస్ (30) అనే వ్యక్తి తనను తాను దైవంగా ప్రకటించుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన దొంగబాబా అని, అతనికి ఓ మహిళతో అక్రమ సంబంధం ఉందని ఇరుగుపొరుగువారు ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన ఆయన.. అక్కడికక్కడే తన జననాంగాన్ని కోసేసుకున్నారు. దీంతో ఆయనపై ఆరోపణలు చేసిన వారు బిత్తరపోయారు. వెంటనే ఆయనను బికనేర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. 

rajastan
taranagar
santosh baba
  • Loading...

More Telugu News