roja: నీ అభివృద్ధా?... చంద్రబాబు అభివృద్ధా?... బుట్టా రేణుకకు రోజా పంచ్ ల వీడియో!

  • చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం ఎక్కడ?
  • కర్నూలులో వర్షాలకు పంటలు మునిగిపోలేదా?
  • ఒక్క సీఎం క్యాంపు కార్యాలయమే అభివృద్ధి చెందింది
  • బుట్టా రేణుకకు ప్రజలే బుద్ధి చెబుతారు: రోజా

వైకాపా నుంచి టికెట్ పొంది, గెలిచి, ఆపై తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకపై ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఆమె చెప్పడాన్ని తప్పుబట్టిన రోజా, "అభివృద్ధి నీకు జరిగిందా? లేక చంద్రబాబుకు జరుగుతున్న అభివృద్ధి నచ్చిందా?" అని పంచ్ ఇచ్చారు. రాయలసీమలో చేనేత కార్మికుల సమస్యలను పక్కన బెట్టిన చంద్రబాబు చెప్పే అభివృద్ధి పలుకులు ఎలా నచ్చాయని రోజా ప్రశ్నించారు.

తన ఎంపీ నియోజకవర్గం పరిధిలో వర్షాలు వచ్చి పంటలు మునిగిపోయినా ఆమెకు కనిపించలేదని, చంద్రబాబునాయుడు, ఆయన క్యాంప్ కార్యాలయం అభివృద్ధి మాత్రం బాగా కనిపించిందని సెటైర్ వేశారు. చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామని అబద్ధాలు చెప్పిన తెలుగుదేశం పార్టీకి, చేనేత కుటుంబంలోనే పుట్టి, ఆడబిడ్డనని చెప్పుకునే బుట్టా రేణుక ఏ విధంగా మద్దతిచ్చారో, ఎందుకు మద్దతిచ్చారో ఆమే తెలియజేయాలని అన్నారు. ఓట్లు వేసిన వారిని, సీటిచ్చిన పార్టీని అవమానించి ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్న బుట్టా రేణుకకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రోజా హెచ్చరించారు.

roja
butta renuka
Telugudesam
ysrcp
  • Error fetching data: Network response was not ok

More Telugu News