YSRCP roja: బుట్టా రేణుక పార్టీ మారడంపై స్పందించిన రోజా!

  • రేణుక అభివృద్ధి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న రోజా 
  • సానుభూతి కోసమే సస్పెన్షన్ ప్రచారమని మండిపాటు
  • తాను టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించని రేణుక

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైసీపీని వీడడంపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు విరుచుకుపడుతుండగా తాజాగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా కూడా నోరు విప్పారు. రాష్ట్రాభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నట్టు రేణుక చెబుతున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. వైసీపీ నుంచి రేణుకను ఎవరూ సస్పెండ్ చేయలేదని, సానుభూతి కోసం ఆమే అలా ప్రచారం చేసుకుంటున్నారని రోజా అన్నారు.  

కాగా, మంగళవారం ఉదయం చంద్రబాబు నివాసానికి కుటుంబ సభ్యులు, అనుచరులతో వచ్చిన రేణుక.. తాను టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రితో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆమె తాను ప్రభుత్వానికి మద్దతు మాత్రమే ఇస్తున్నట్టు చెప్పారు. అయితే ఆమె అనుచరులు మాత్రం టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

YSRCP roja
butta renuka
kurnool
mp
Telugudesam
chandrababu
  • Loading...

More Telugu News