Haryana Roadways: ప్రయాణికుల ప్రాణాలు గాల్లో వదిలేసి.. హాయిగా దమ్ముకొడుతూ బస్సును నడిపిన డ్రైవర్.. వీడియో ఇదిగో!

  • త‌న ప‌నిప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన డ్రైవర్ 
  • సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌గా కావడంతో పోలీసు కేసు నమోదు
  • ఓ చేతితో స్టీరింగ్ పట్టుకుని మరో చేతిలో పొగతాగిన డ్రైవర్
  • పనిలోంచి తొలగించిన హర్యానా రోడ్ వేస్

బ‌స్సు ప్ర‌యాణం చేస్తున్న‌ప్పుడు ప్ర‌యాణికుల ప్రాణాలు డ్రైవ‌ర్ చేతిలో ఉంటాయ‌ని అంటారు. ‘డ్రైవ‌ర‌న్నా జ‌ర‌భ‌ద్రం’ అని డ్రైవ‌ర్ సీటు ముందు మన ఆర్టీసీ అధికారులు పోస్ట‌ర్లు కూడా అంటించి ఉంచుతారు. ఎంతో ఏకాగ్ర‌త‌తో బ‌స్సు న‌డిపించాల్సిన డ్రైవ‌ర్ త‌న ప‌నిప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తే ప్ర‌యాణికులకు ముప్పు పొంచి ఉంటుంది. హ‌ర్యానాలో ఓ బ‌స్సు డ్రైవ‌ర్ ఎంతో నిర్ల‌క్ష్యంగా ప్ర‌వ‌ర్తించిన ఘ‌ట‌నకు సంబంధించిన ఓ వీడియో.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

చివ‌రికి ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్ల‌డంతో కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేసి, చివ‌రికి ఆ బ‌స్సు డ్రైవ‌ర్‌ను గుర్తించారు. ఆ బ‌స్సు నెంబ‌రు HR 55W 9038 అని, ఆ వ్య‌క్తి పేరు ఓమ్ ప్ర‌కాశ్ అని పోలీసులు చెప్పారు. ఆ డ్రైవ‌ర్ బస్సులో ఓ చేతిలో హుక్కా ప‌ట్టుకుని డ్రైవింగ్‌లో ఉండ‌గా ధూమ‌పానం చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ్డాడ‌ని తెలిపారు.

ఆ బ‌స్సు డ్రైవ‌ర్ ఈ చ‌ర్య‌కు పాల్ప‌డుతుండ‌గా ఆ బ‌స్సు ప‌క్క‌నుంచి వెళుతోన్న ఓ కారులోంచి ఓ యువ‌కుడు ఈ వీడియో తీశాడ‌ని చెప్పారు. ఆ డ్రైవర్ ను హర్యానా రోడ్ వేస్ పనిలో నుంచి తొలగించింది. ఈ వీడియోను మీరూ చూడండి...

  • Error fetching data: Network response was not ok

More Telugu News