7 kgs: ఏడు కేజీల మగ బిడ్డకు జన్మనిచ్చిన వియత్నాం మహిళ!
- ఆశ్చర్యంలో తల్లిదండ్రులు
- నమ్మలేకపోయిన వైద్యులు
- పూర్తి ఆరోగ్యంగా ఉన్న బిడ్డ
వియత్నాంలోని దక్షిణ విన్ ఫూక్ ప్రాంతానికి చెందిన గుయేన్ కిమ్ లెయిన్ పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. నొప్పులు తీవ్రంగా వస్తుండటంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకి తీశారు. ఆ మగ బిడ్డను చూసి డాక్టర్లు నమ్మలేకపోయారు. తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే... ఆ బిడ్డ బరువు 7.1 కేజీలు.
బిడ్డ కడుపులో ఉన్నపుడే 5 కేజీల వరకు ఉంటాడని డాక్టర్లు అంచనా వేశారు. కానీ పుట్టిన తర్వాత చూస్తే 7.1 కేజీలు బరువుండటంతో వారు నమ్మలేకపోయారు. బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, వియత్నాంలో ఇప్పటి వరకు ఇంత బరువుతో ఎవరూ జన్మించలేదని డాక్టర్లు తెలిపారు. తల్లిదండ్రులు ఈ బాబుకు ట్రాన్ టైన్ అని పేరు పెట్టారు. 2010లో ఇటలీలో 10.2 కేజీల బరువుతో జన్మించిన బిడ్డ ప్రపంచంలో అత్యంత బరువుతో జన్మించిన బిడ్డగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. భారత్‌లో 2016లో 6.82 కేజీల బరువున్న బిడ్డ కర్ణాటకలో జన్మించింది.