naramalli padmaja: చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు: నారమల్లి పద్మజ

  • జగన్ పాదయాత్ర గురించి చంద్రబాబు భయపడుతున్నారు
  • చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు
  • ప్యాకేజీల కోసం నేతలు పార్టీలు మారడం దారుణం

తమ పార్టీ అధినేత జగన్ చేపట్టబోయే పాదయాత్ర గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని... ఈ కారణంగానే పార్టీ ఫిరాయింపులతో మైండ్ గేమ్ ఆడుతున్నారని వైసీసీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మండిపడ్డారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక, ప్యాకేజీలు ఇస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జగన్ పాదయాత్రను తక్కువ చేస్తూ, నీచ రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలు వైసీపీకి ఓటు వేసి గెలిపిస్తే... ప్యాకేజీల కోసం పార్టీలు మారడం దారుణమని అన్నారు. ఓ వైపు విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

naramalli padmaja
ysrcp
chandrababu
ap cm
ys jagan
  • Loading...

More Telugu News