butta renuka: 70 కోట్ల ప్యాకేజీ అందిందని ప్రజలంతా అనుకుంటున్నారు: రేణుకపై జోగి రమేష్ విమర్శలు

  • జగన్ వల్లే గెలిచానని చెప్పుకున్న రేణుక టీడీపీలో ఎందుకు చేరారు?
  • చంద్రబాబు మరోసారి రాజకీయ వ్యభిచారానికి తెర తీశారు
  • గతంలో టీఆర్ఎస్ ను విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పని చేస్తున్నారు

వైసీపీ అధినేత జగన్ వల్లే ఎంపీగా గెలిచానంటూ ఇన్ని రోజులు చెప్పిన బుట్టా రేణుక... ఇప్పుడు టీడీపీలో ఎందుకు చేరారని వైసీపీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని రేణుకకు ఎంపీ టికెట్ ఇచ్చింది జగనే అని అన్నారు. కర్నూలుకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారనా? లేక బలహీన వర్గాలకు మేలు చేశారనా? ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 70 కోట్ల ప్యాకేజీ అందిందని ప్రజలంతా అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి రాజకీయ వ్యభిచారానికి తెర తీశారని జోగి రమేష్ అన్నారు. అందరూ తిడుతుంటే చంద్రబాబు మారారని అనుకున్నామని... కానీ, ఆయన మారలేదని చెప్పారు. సంతలో పశువులను కొనుగోలు చేస్తున్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ గతంలో టీఆర్ఎస్ ను విమర్శించిన చంద్రబాబు... ఇప్పుడు అదే పని చేస్తున్నారని మండిపడ్డారు.

butta renuka
kurnool mp
jogi ramesh
chandrababu
ap cm
ysrcp
ys jagan
  • Loading...

More Telugu News