yogi adityanath: తాజ్ మహల్ నిర్మాణంపై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు!

  • తాజ్ ను ఎవరు కట్టారు, ఎందుకు కట్టారనేది అనవసరం
  • ఈ కట్టడం వెనుక భారతీయ కార్మికుల రక్తం, చెమట ఉన్నాయి
  • 26న తాజ్ ను సందర్శిస్తున్నా

తాజ్ మహల్ కు సంబంధించి నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తాజ్ పై అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజ్ మహల్ ను ఎవరు, ఎందుకు కట్టించారనేది అనవసరమైన చర్చ అని... అయితే, ఆ కట్టడాన్ని భారతీయ కార్మికుల రక్తం, చెమటతో నిర్మించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

 ఈ నెల 26న తాను తాజ్ మహల్ ను సందర్శిస్తున్నానని చెప్పారు. పర్యాటక కోణంలో తాజ్ మహల్ యూపీ ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనదని... ఇక్కడకు వచ్చే టూరిస్టులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో ఘనంగా వేడుకలను నిర్వహించబోతున్నామని చెప్పారు.

yogi adityanath
up cm
taj mahal
cm yogi comments on taj mahal
  • Loading...

More Telugu News