mamatha banerjee: దేశం పేరును కూడా మార్చేస్తారు!: బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్

  • బీజేపీ నియంతృత్వ పోకడలను అనుసరిస్తోంది
  • ప్రజాస్వామ్య విధానాలను పాటించడం లేదు
  • దేశం పేరును కూడా మార్చేస్తారు

తాజ్ మహల్ దేశ ద్రోహులు నిర్మించిన కట్టడమంటూ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బీజేపీ రాజకీయ అజెండాను సంగీత్ సోమ్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. మన దేశం పేరును మార్చేందుకు కూడా బీజేపీ యత్నిస్తుందని... ఆ రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.

బీజేపీ ప్రజాస్వామ్య విధానాలను అవలంబించడం లేదని... నియంతృత్వ పోకడలను అనుసరిస్తోందని దీదీ మండిపడ్డారు. మన దేశంలో వివిధ మతాలు, వర్గాలు, జాతులు, కులాలకు చెందిన ప్రజలు ఉన్నారని... బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో దేశ సమగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టిన బీజేపీ నేతలు... విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

mamatha banerjee
west bengal cm
sangeeth som
bjp
tmc
  • Loading...

More Telugu News