butta renuka: వైసీపీ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదు: బుట్టా రేణుక

  • వైసీపీ కోసం నిజాయతీగా పని చేశా
  • ప్రభుత్వ అభివృద్ది పనులకు మద్దతు ప్రకటించా
  • అంతటి అనుభవం నాకు లేదు 

తాను టీడీపీలో ఇంకా చేరలేదని... కేవలం ప్రభుత్వానికి మద్దతు మాత్రమే తెలిపానని కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులకు మద్దతు ప్రకటించానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై అందరికీ స్పష్టతను ఇచ్చేందుకే... బహిరంగంగా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు ప్రకటించానని తెలిపారు.

తనను వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదని ఆమె అన్నారు. ఒకవైపు తన భర్త వైసీపీతో విభేదించినా... తాను మాత్రం పార్టీ కోసం నిజాయతీగా పని చేశానని చెప్పారు. వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారనే విషయాన్ని విశ్లేషించేంత అనుభవం తనకు లేదని చెప్పారు.  

butta renuka
kurnool mp
Telugudesam
ysrcp
butta renuka suspension
  • Loading...

More Telugu News