raviteja: నటనలో రవితేజ అదుర్స్ అనిపించారు .. దిల్ రాజు పొగిడేశారు : అనిల్ రావిపూడి

  • రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్' 
  • రేపే భారీస్థాయిలో రిలీజ్ 
  • మొదట్లో సందేహించిన రవితేజ 
  • సెకండాఫ్ విన్నాక ఒప్పేసుకున్నారు  

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'రాజా ది గ్రేట్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హీరోను అంధుడిగా చూపించాలనుకోవడం ఒక సాహసమేనని చెప్పారు. కథలో కొత్తదనముండాలి .. హీరోను కొత్తగా చూపించాలనే ఆలోచనతోనే ఈ కథను సిద్ధం చేసుకున్నానని అన్నారు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'ఒప్పం' సినిమా తనకి స్ఫూర్తి అని చెప్పారు.

 కథ కొంతవరకూ చెప్పినప్పుడు రవితేజ సందేహించారనీ, పూర్తిగా విన్న తరువాత చేయడానికి ఆసక్తిని చూపారని అన్నారు. పుట్టుకతో అంధుడైన ఓ కుర్రాడు ఎలా పెరిగాడు? .. ఆయనకి ఎదురైన పరిస్థితులు ఎలాంటివి? అప్పుడు ఆయన ఏం చేశాడు? అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుందని చెప్పారు. చూపులేని వ్యక్తిగా రవితేజ అదరగొట్టేశాడనీ, ఈ సినిమా చూసిన దిల్ రాజు తన పనితీరును పొగిడేశారని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News