me too: లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్న మహిళలు... ట్రెండింగ్‌గా మారిన #MeToo
- సోషల్ మీడియాలో ముందుకొస్తున్న సెలెబ్రిటీలు
- తమకు జరిగిన అన్యాయాలను పంచుకుంటున్న మహిళలు
- అన్యాయానికి వ్యతిరేకంగా మహిళల ప్రచారం
ప్రముఖ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ తమను లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ దాదాపు 30 మంది నటీమణులు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ప్రపంచ వ్యాప్తనగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేఫథ్యంలోనే లైంగిక వేధింపులకు గురైన మహిళలంతా బయటకు రావాలని అమెరికన్ నటి అలిసా మిలానో కోరింది. ఇందుకోసం #MeToo అనే ట్యాగ్‌ను ఉపయోగించాలని కోరింది.
ఆమె చొరవకు చాలా మంది మహిళలు స్పందించారు. సెలెబ్రిటీలు, సాధారణ మహిళలు ఇలా ప్రతి ఒక్కరూ తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. సినిమా, రాజకీయం, కార్పోరేట్, ఐటీ.. ఇలా అన్ని రంగాల్లో పనిచేస్తున్న మహిళలు తమకు వివిధ చోట్ల జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటారు. వేధింపుల ఘటనలకు ముగింపు పలకడానికి వీరంతా #MeToo ట్యాగ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల్లోనే #MeToo సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.