sashi tharur: ప్రధానికి ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చిన శశిథరూర్!

  • గాంధీలకు గుజరాతీయులంటే అస్సలు నచ్చదన్న మోదీ
  • గుజరాతీయులంటే మాకు ఏహ్య భావం లేదు. మా కోడలు గుజరాతీయే అన్న థరూర్!
  • గుజరాతీ యువతి భూమికను వివాహం చేసుకున్న శశి థరూర్ కుమారుడు

గాంధీలకు గుజరాతీలంటే అస్సలు నచ్చదన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ట్విట్టర్ మాధ్యమంగా కౌంటర్ ఇచ్చారు. తమకు మోదీ చెప్పినట్టు గుజరాతీలంటే ఏహ్యభావం లేదని, ఆయనకు మాత్రం కేవలం ఒక్క గుజరాత్‌ అంటేనే ప్రేమ ఉందని విమర్శించారు. తన కుమారుడు గుజరాతీ అమ్మాయినే చేసుకున్నాడని ఆయన గుర్తుచేశారు.

గుజరాతీలంటే తమకు ఎలాంటి ద్వేషాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆయనకు మాత్రం ఒక్క గుజరాత్ అంటేనే ప్రేమ ఉన్నట్టు కనిపిస్తోందని ఆయన తెలిపారు. శశి థరూర్ కుమారుడు వాషింగ్టన్ పోస్ట్ లో జర్నలిస్టుగా పనిచేస్తూ, భూమిక అనే గుజరాతీని గత ఆదివారమే వివాహం చేసుకున్నాడు. దానిని ప్రస్తావిస్తూ ఆయన ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. 

sashi tharur
modi
counter
twitter
  • Loading...

More Telugu News