chandrababunaidu: అభివృద్ధి కోరుకునేవారంతా టీడీపీలోకి వచ్చేయండి: బుట్టా రేణుక

  • అభివృద్ధిని చూసే పార్టీ మారాను
  • అభివృద్ధిని కాంక్షించే వారు టీడీపీలో చేరాలి
  • తగినన్ని నిధులు లేకున్నా చంద్రబాబు కష్టపడుతున్నారు

అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నానని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన బుట్టా రేణుక మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చి మూడేళ్లు అయినప్పటికీ తాను రాజకీయాలు చేయలేదని అన్నారు. తన దృష్టంతా అభివృద్ధిపైనే ఉందని చెప్పారు. అందుకే నేడు అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబునాయుడుకి సహకారమందించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిని చూసి తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత నిధులు లేనప్పటికీ చంద్రబాబు తీవ్రంగా కష్టపడుతున్నారని ఆమె చెప్పారు. తనలాగే అభివృద్ధిని కాంక్షించేవారంతా టీడీపీలో చేరాలని ఆమె పిలుపునిచ్చారు. 

chandrababunaidu
cbn
butta renuka
Telugudesam
amaravathi
  • Loading...

More Telugu News