harassment: నిన్ను రేప్ చేస్తానని జర్నలిస్టును బెదిరించిన ఎడిటర్ ఇన్ చీఫ్.. సోషల్ మీడియాలో దుమారం!

  • హార్వే వెయిన్ స్టీన్ లైంగిక వేధింపులతో పెరిగిన చైతన్యం
  • ఫ్రాన్స్ లో మొదలైన బాలన్సెటన్‌ పోర్క్‌ యాష్‌ ట్యాగ్‌ ఉద్యమం
  • లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెడుతున్న నెటిజన్లు

హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్ స్టీన్ లైంగిక వేధింపులకు బలైన నటీమణుల పోరాటం సత్ఫలితాలు ఇస్తోంది. అమెరికాలో మొదలైన ఆ పోరాటం విశ్వవ్యాప్తమవుతోంది. సోషల్ మీడియాలో ఏకతాటిపైకి వస్తున్న మహిళలంతా లైంగిక వేధింపులకు గురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుని, నిందితులను కడిగిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లో ఒక కొత్త ఉద్యమం మొదలైంది. బాలన్సెటన్‌ పోర్క్‌ యాష్‌ ట్యాగ్‌ (#balancetonporc)తో ట్విట్టర్‌ వేదికగా ఈ ఉద్యమం మొదలైంది. ఈ యాష్‌ ట్యాగ్‌ అర్థం 'మీ పంది బండారం బయటపెట్టండి' అని.

ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టిన ఫోయిస్ లాగే రేడియో జర్నలిస్టు సాండ్రా ముల్లర్ తానెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతూ, ఒకరోజు తమ సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ 'నీకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఓ రోజు నీపై అత్యాచారం చేస్తా'నని బెదిరించాడని ట్విట్టర్ లో తెలిపింది. దీంతో ట్విట్టర్ లో పెను దుమారం రేగింది. అప్పటి నుంచి తమపై జరిగిన లైంగిక వేధింపుల పర్వాన్ని వెల్లడిస్తూ వేలాదిమంది మహిళలు స్పందిస్తున్నారు. మరికొందరు అప్పట్లో ఈ వేధింపులను బయటపెట్టలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News