butta renuka: కాసేపు ఆగండి, అన్నీ చెబుతా... చంద్రబాబు ఇంటికి బయలుదేరుతూ బుట్టా రేణుక

  • నేడు పచ్చ కండువా కప్పుకోనున్న బుట్టా రేణుక
  • ఉదయం 10 గంటలకు బాబు సమక్షంలో టీడీపీ తీర్థం
  • ఆ తరువాత మాట్లాడతానన్న కర్నూలు ఎంపీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై కర్నూలు పార్లమెంట్ నియోజవర్గం నుంచి విజయం సాధించిన బుట్టా రేణుక మరికాసేపట్లో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్న ఆమె, కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి బయలుదేరారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత కొత్తకోట ప్రకాశ్ రెడ్డి కూడా టీడీపీలో చేరనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో బుట్టా రేణుకను పార్టీలోకి ఆహ్వానించిన తరువాత, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు కాసేపు ప్రసంగిస్తారని సమాచారం. ఆ తరువాత ఆయన నాగపూర్ బయలుదేరి వెళతారు.

 కాగా, విజయవాడలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును కలిసిన తరువాత, తాను పార్టీ మారడానికి గల కారణాలను వెల్లడిస్తానని బుట్టా రేణుక తెలియజేయడం గమనార్హం. బుట్టా రేణుకతో పాటు కర్నూలు, పాణ్యం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది అభిమానులు కూడా చంద్రబాబు ఇంటి వైపు కదులుతున్నారు.

butta renuka
chandrababu
karnool
  • Loading...

More Telugu News