chandrababu: నాగపూర్ లోని నితిన్ గడ్కరీ ఇంటికి వెళుతున్న చంద్రబాబు!

  • విదేశీ పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పు
  • పోలవరం ప్రాజెక్టుకు సత్వర నిధుల కోసం గడ్కరీ ఇంటికి
  • విశాఖ టూ ఢిల్లీ... వయా నాగపూర్
  • చంద్రబాబుతో పాటు మంత్రి దేవినేని 

నేడు ఢిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లాల్సిన చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గడువులోగా పోలవరం ప్రాజెక్టు పనులను ఎలాగైనా పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు, అందుకు తగిన సహకారాన్ని అందించాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని స్వయంగా కలవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం నాగపూర్ కు వెళ్లి గడ్కరీ ఇంట్లోనే చర్చలు జరపనున్నారు. గడ్కరీతో చర్చలకు చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రి దేవినేని కూడా వెళ్లనున్నారు.

రాష్ట్రానికి పోలవరం ఆవశ్యకతను వివరించి, గుత్తేదారు సంస్థల జాప్యం వల్ల కలుగుతున్న నష్టాన్ని ఆయనకు వివరించనున్నారు. మరికాసేపట్లో విజయవాడ నుంచి బయలుదేరే చంద్రబాబు, తొలుత నాగపూర్ కు వెళ్లి, గడ్కరీ నివాసంలో కాసేపు గడిపిన అనంతరం, ఢిల్లీకి బయలుదేరి వెళతారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను త్వరగా తెచ్చుకోవడం, మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే చంద్రబాబు ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.

కాగా షెడ్యూల్ ప్రకారం, నేడు విశాఖపట్నం నుంచి చంద్రబాబు డైరెక్టుగా ఢిల్లీకి బయలుదేరాల్సి వుంది. మారిన షెడ్యూల్ నేపథ్యంలో ఆయన రాత్రే విజయవాడ చేరుకున్నారు.

chandrababu
nitin gadkari
polavaram
  • Loading...

More Telugu News