china: చైనా దొంగతనం ద్వారా తయారు చేసిన యుద్ధ విమానాల వివరాలు!
- ఆస్ట్రేలియా నుంచి స్టెల్త్ విమానాలు
- రష్యా నుంచి జె, మిగ్ రకం విమానాలు
- అమెరికా నుంచి ఎఫ్-35, జె-31, జె-20, మానవరహిత విమానాలు
- అంతా కాపీ పేస్టు టెక్నాలజీనే!
వివిధ దేశాల నుంచి సాంకేతిక సమాచారాన్ని దొంగిలిస్తూ, దాని సాయంతో తయారు చేసిన యుద్ధ విమానాలను తమ శాస్త్రవేత్తల ఆవిష్కరణలంటూ గొప్పలు పోతుంటుంది. వాటిపై తమ అధికారిక పత్రికల్లో కథనాలు కూడా ప్రచురిస్తూ వుంటుంది. ఇదే రీతిలో ఇటీవల చైనా తన వైమానిక దళంలో చెంగ్డూ జె-20 స్టెల్త్ విమానాన్ని ప్రవేశపెట్టినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం స్టెల్త్ విమానం మాత్రమే కాకుండా, జె సిరీస్ లో చైనా తయారు చేసిన చాలా రకాల విమానాలు ‘కాపీ-పేస్ట్’ టెక్నాలజీ అని నిపుణులు నిర్ధారించారు.
జె-7 రకానికి చెందిన విమానాలు రష్యాకు చెందిన మిగ్-21కి నకళ్లు. రష్యాకే చెందిన సు-27 ఫాల్కనర్ మల్టీరోల్ ఫైటర్ జెట్స్ నుంచి జె-11 విమానాలను కాపీ పేస్ట్ విధానంలో చైనా తయారు చేసింది. అమెరికా నుంచి ఎఫ్- 35 విమాన సమాచారాన్ని అపహరించి జె-31, జె-20 ఫైటర్లను సిద్ధం చేసింది.
అంతే కాకుండా అమెరికా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను హ్యాక్ చేసి మానవ రహిత విమానాలను చైనా తయారు చేసింది. అందువల్లే చైనా తయారు చేసిన మానవ రహిత విమానాలు అచ్చుగుద్దినట్లు అమెరికా విమానాలను పోలి ఉండడం విశేషం.