Hyderaba: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 23 నుంచి టీ20 టికెట్ డబ్బుల పంపిణి

  • అభిమానుల ఆందోళనతో దిగొచ్చిన హెచ్‌సీఏ
  • 9 రోజులపాటు డబ్బుల పంపిణి 
  • ఒరిజినల్ టికెట్లు, బ్యాంకు ఖాతా వివరాలతో రావాలని సూచన

భారత్-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈనెల 13న జరగాల్సిన చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ రద్దుతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. తమ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ హెచ్‌సీఏ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో దిగి వచ్చిన నిర్వాహకులు టికెట్ డబ్బులు ఇస్తామని ప్రకటించారు. అయితే ఎప్పుడు అన్న విషయాన్ని చెప్పలేదు.

తాజాగా ఈ నెల 23 నుంచి టికెట్ డబ్బులను తిరిగి చెల్లించాలని హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. అభిమానులు తమ ఒరిజినల్ టికెట్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో ఉప్పల్ స్టేడియానికి రావాలని కోరింది. 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో 23, 24 తేదీల్లో రూ.800, 25, 26 తేదీల్లో రూ.1000, 27, 28 తేదీల్లో రూ.1500, 30, 31 తేదీల్లో రూ.5000 టికెట్ల డబ్బులను ఎన్.ఈ.ఎఫ్.టి  ద్వారా రిఫండ్ చేస్తామని వివరించింది. అలాగే హాస్పిటాలిటీ, కార్పొరేట్ బాక్సుల టికెట్ల డబ్బులను ఎప్పుడు చెల్లించేది త్వరలో తెలియజేస్తామని అపెక్స్ కౌన్సిల్ తెలిపింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News