మరి, ఎర్రకోటపై జెండా ఎగురవేయడాన్ని మోదీ ఆపేస్తారా?: అసదుద్దీన్ ఒవైసీ
- తాజ్ మహల్ పై బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ఒవైసీ
- నిరుద్యోగం, ఉగ్రవాదంలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి
- అనవసర వివాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆ కట్టడాలన్నీ దేశద్రోహులు కట్టినవి అయినప్పుడు... ఎర్రకోటపై జెండా ఎగురవేయడాన్ని ప్రధాని మోదీ ఆపేస్తారా? అని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం, ఉగ్రవాదం తదితర సమస్యలెన్నో ఉన్నాయని... వాటిని పరిష్కరించలేక, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అనవసర అంశాలను వివాదాస్పదం చేస్తున్నారంటూ మండిపడ్డారు.