actor anasuya: రామ్ చరణ్ కు మాట ఇచ్చా.. నెక్స్ట్ షెడ్యూల్ లో నిలబెట్టుకుంటా!: అనసూయ

  • కాకరకాయ వంట బాగా చేస్తా
  • వండిపెడతానని చరణ్ కు ప్రామిస్ చేశా
  • కొత్త పనులు నేర్చుకోవడంలో చరణ్ ఉత్సాహం చూపుతాడు

హీరో రామ్ చరణ్ పై నటి అనసూయ ప్రశంసలు కురిపించింది. ఏ విషయాన్నైనా చరణ్ చాలా తొందరగా నేర్చుకుంటాడని తెలిపింది. కొత్త పనులు నేర్చుకునే విషయంలో ఓ పిల్లాడిలా ఉత్సుకత చూపుతాడని... అతని ఉత్సాహాన్ని చూస్తే ఆనందం కలుగుతుందని చెప్పింది. 'రంగస్థలం' సినిమా సెట్ లో తామంతా ఆహారం, సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నామని చెప్పింది.

తాను కాకరకాయ వంటను బాగా చేస్తానని... దాన్ని చేసుకుని వస్తానని చరణ్, సుకుమార్ లకు ప్రామిస్ చేశానని తెలిపింది. తర్వాతి షూటింగ్ షెడ్యూల్ లో వారికి ఈ వంట వండిపెట్టడానికి ఆత్రుతగా ఉన్నానని చెప్పింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తో కలసి పని చేయడం గురించి చెబుతూ, ఆమె ఈ వివరాలను వెల్లడించింది. 

actor anasuya
ram charan
tollywood
director sukumar
rangasthalam
  • Loading...

More Telugu News