chandrababu: బీసీలను సీఎం మోసం చేస్తున్నారు.. మీ సత్తా ఏంటో చూపండి: బీసీ నేతలతో జగన్

  • బీసీలను ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూస్తోంది
  • చంద్రబాబు అన్యాయాలను ప్రజలకు తెలియజెప్పాలి 
  • బీసీ గర్జన నిర్వహిస్తాం

బీసీలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అని చెప్పిన ముఖ్యమంత్రి... ఆ తర్వాత మాట తప్పారని విమర్శించారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా చేయలేదని అన్నారు. బీసీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష, చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నేతలు పర్యటించాలని, చంద్రబాబు అన్యాయాలను ప్రజలకు వివరించాలని అన్నారు.

విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో బీసీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను ఇచ్చిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డిదేనని జగన్ అన్నారు. బీసీలను పట్టించుకోని చంద్రబాబుకు తమ పవర్ ఏంటో బీసీలు చూపాలని పిలుపునిచ్చారు. ఏపీలో బీసీల సత్తా ఏంటో చూపుతామని, బీసీ గర్జన జరుపుతామని తెలిపారు.


chandrababu
ap cm
ys jagan
ysrcp
bc gharjana
  • Loading...

More Telugu News