donald trump: ట్రంప్ ను దింపేద్దామంటూ పేపర్ లో ప్రకటన.. అమెరికాలో చర్చనీయాంశం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-0787bd7c119357ba58d9206a6719208360424cad.jpg)
- అధ్యక్ష పదవికి ట్రంప్ అర్హుడు కాదు
- అతన్ని దింపేందుకు అందరూ సహకరించండి
- ఎన్నికల్లో కూడా ట్రంప్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు
హస్ట్ లర్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు లారీ ఫ్లింట్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ఇచ్చిన ప్రకటన ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే సమాచారాన్ని అందించిన వారికి 10 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటన ఇచ్చారు. ట్రంప్ నుంచి తాను కోట్లాది రూపాయలను కోరడం లేదని... కేవలం ఆయనను పదవి నుంచి తప్పించాలని మాత్రమే కోరుకుంటున్నానని ప్రకటనలో పేర్కొన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని... అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే అధ్యక్ష పదవికి అర్హుడు కాదని నిరూపించుకున్నాడని తెలిపాడు. ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు అందరూ సహకరించాలని కోరాడు. గతంలో కూడా ఇద్దరు రిపబ్లికన్ నేతల బండారాన్ని లారీ ఫ్లింట్ బయటపెట్టాడు.