roja: ఒక్క బాలయ్యతోనే పేకాట ఆడేందుకు కూర్చునేదాన్ని: రోజా

  • షూటింగ్ గ్యాప్ లో పేకాటకు పిలిచే బాలకృష్ణ
  • భైరవద్వీపం షూటింగ్ నాటి ఘటన
  • గుర్తు చేసుకున్న వైకాపా ఎమ్మెల్యే రోజా

తనకు చతుర్ముఖ పారాయణం ఎంతమాత్రమూ అలవాటు లేదని తాను పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే, తన తల్లి కొట్టేదని వైకాపా ఎమ్మెల్యే,రోజా వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ, మీరు పేకాట బాగా ఆడతారట కదా? అన్న ప్రశ్న ఎదురుకాగా, రోజా సమాధానం ఇచ్చారు. తొలి చిత్రం షూటింగ్ సమయంలో తనకెంతో టెన్షన్ గా ఉండేదని గుర్తు చేసుకున్న రోజా, ఎప్పుడు షూటింగ్ అయిపోతే ఇంటికెళ్లి పోదామా అని ఉండేదని అన్నారు.

అయితే, బాలకృష్ణతో 'భైరవద్వీపం' చిత్రం చేసిన సమయంలో పేకాట ఆడానని చెప్పారు. ఆయనతో షూటింగ్ ఉంటే మాత్రం, సెట్లో పేకాట సందడి కనిపించేదని అన్నారు. భైరవద్వీపం సినిమా షూటింగ్ గ్యాప్ లో తనను, సత్యనారాయణను పిలిచి పేకాటకు కూర్చేబెట్టేవారని, అప్పుడు మాత్రం తాను కూడా ఆడేదాన్నని చెప్పారు. డబ్బులకు మాత్రం కాదని నవ్వుతూ చెప్పారు. తనకేమీ పేకాటంటే ఇష్టం ఉండేది కాదని, అయితే, బాలయ్య ఒత్తిడితో నేర్చుకున్నానని అన్నారు. ఆపై మరెవరితోనూ ఆడలేదని అన్నారు.

roja
balakrishna
playing cards
  • Loading...

More Telugu News