chandrababu: చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ ఎమ్మెల్యే!

  • కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న పథకాలను కూడా రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు
  • నా వల్లే చంద్రన్న బీమా పథకం పేరును మార్చారు
  • కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడంలో బీజేపీ నేతలు విఫలమవుతున్నారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే... ఆ పథకాలన్నీ రాష్ట్ర పభుత్వ పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవడంలో బీజేపీ నేతలు విఫలమవుతున్నారని అన్నారు.

చంద్రన్న బీమా పథకం పేరును ప్రధాన మంత్రి చంద్రన్న బీమా పథకంగా మార్చిన అంశంపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖల మంత్రులు విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయ్యారని... ఆ సందర్భంలో చంద్రన్న బీమా పథకంపై చర్చ జరిగిందని... ఆ చర్చలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, చంద్రన్న పేరు పెట్టుకోవడం ఏంటని తాను ప్రస్తావించానని చెప్పారు. దీంతో, ప్రధాన మంత్రి చంద్రన్న బీమా పథకంగా పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు. గాజువాకలో జరిగిన బీజేపీ మహావిశాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

chandrababu
ap cm
vishnu kumar raju
bjp mla
ap bjp
chandranna beema pathakam
  • Loading...

More Telugu News