china: భారత్ బలహీన దేశం కాదని చైనా అర్థం చేసుకుంది: రాజ్ నాథ్ సింగ్
- దేశసరిహద్దులు పూర్తి సురక్షితంగా ఉన్నాయి
- చైనాతో సమస్య పరిష్కారమైంది
- పాక్ పన్నాగాలు పన్నుతోంది
భారత్ బలహీన దేశం కాదని చైనా అర్థం చేసుకుంటోందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో భారతీయ లోధి మహాసభ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితంగా ఉన్నాయని అన్నారు. చైనాతో నెలకొన్న సమస్య (డోక్లాం) పరిష్కారమైందని ఆయన తెలిపారు. అయితే పాకిస్థాన్ కు మాత్రం అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. భారత్ ను విచ్ఛిన్నం చేసేందుకు పాక్ పన్నాగాలు పన్నుతోందని ఆయన చెప్పారు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.