NOKIA 8: సెల్ఫీ అయిపోయింది.. ఇప్పుడు ‘బోథీ’ వంతు!

  • సెల్ఫీలకు ఇక చెల్లుచీటీ
  • ఒకేసారి ముందు, వెనక కెమెరాలతో ఫొటో
  • సరికొత్త టెక్నాలజీతో వచ్చేసిన ‘నోకియా 8’

ఎంతకాలం ఈ సెల్ఫీల సీజన్ అనుకుంటున్న వారికి ఇప్పుడు ‘బోథీ’ వచ్చేసింది. ఇదేం పేరు.. ఎప్పుడూ వినలేదే.. అనుకుంటున్న వారు ముందుగా నోకియా 8 స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకోవాలి. ఈ ఫోన్‌లో ఉపయోగించిన సాంకేతికత ద్వారా ముందు, వెనక కెమెరాలను ఒకేసారి ఉపయోగించి ఫొటోలు తీసుకోవచ్చు. దీనినే ‘బోథీ’ అంటున్నారు. స్మార్ట్‌ఫోన్లలో ఇటువంటి సాంకేతికతను ఉపయోగించడం ఇదే తొలిసారి. శనివారం మార్కెట్లోకి వచ్చిన ‘నోకియా 8’ ధర రూ.36,999. ఇందులో ‘బోథీ’తోపాటు ప్రత్యక్ష ప్రసారాలను వేగంగా అందించేందుకు ఫేస్‌బుక్ లైవ్, యూబ్యూబ్ లైవ్ ఆప్షన్లను ముందుగానే ఇన్‌స్టాల్ చేశారు.

మూడు రంగుల్లో అందుబాటులో ఉన్న ‘నోకియా 8’ 7.1.1 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ప్రత్యేకతల విషయానికొస్తే 5.3 అంగుళాల డిస్‌ప్లే, 13 ఎంపీ రియర్ కెమెరా, జెసిస్ అద్దాలతో రియర్ కెమెరా, క్వాల్-కామ్ స్నాప్ డ్రాగన్ 835, 1.8 గిగా హెడ్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 64 జీబీ ఇంటర్నెల్ మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 3090 ఎంఏహెచ్ సామర్థ్యం గల నాన్-రిమూవబుల్ బ్యాటరీ ఉన్నాయి.
 

  • Loading...

More Telugu News