rajnath: పాకిస్థాన్‌ సైన్యం రెచ్చగొట్టేలా కాల్పులకు దిగుతోంది: రాజ్ నాథ్ సింగ్

  • ఒకవేళ‌ భార‌త‌  సైన్యం ఘాటుగా ప్రతిస్పందిస్తే పాక్ ఏమీ చేయ‌లేదు
  • శాంతిని నెలకొల్పేందుకు మోదీ ఎన్నో ప్రయత్నాలు జరిపారు
  • సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నెహ్రూ స్వేచ్ఛ ఇచ్చివుంటే, ఇప్పుడు కశ్మీర్‌ సమస్య ఉండేది కాదు

సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆర్మీ భారత్‌ను రెచ్చగొట్టేలా కాల్పులకు దిగుతోంద‌ని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒకవేళ‌ భార‌త‌  సైన్యం ఘాటుగా ప్రతిస్పందిస్తే పాక్ ఏమీ చేయ‌లేద‌ని అన్నారు. పాక్‌తో శాంతిని నెలకొల్పేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు జ‌రిపినా పాక్ బుద్ధి మార్చుకోలేద‌ని అన్నారు. చివ‌రికి ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మరీ మోదీ పాకిస్థాన్ వెళ్లార‌ని గుర్తు చేశారు.

కాగా, ఆనాడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నాటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్వేచ్ఛ ఇచ్చివుంటే కనుక, ఇప్పుడు కశ్మీర్‌ సమస్య ఉండేది కాదని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ విషయంలో సమస్య పరిష్కారానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నామ‌ని అన్నారు. భార‌త్‌లోకి ప్ర‌వేశిస్తోన్న‌ ఉగ్రవాదుల ఆగ‌డాల‌ను అణచివేయ‌డంలో సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News