amirkhan: కోహ్లీ తనతో కలిసి డ్యాన్స్ చేస్తోన్న వీడియోను పోస్ట్ చేసిన ఆమిర్ ఖాన్!
- దీపావళి సందర్భంగా టీవీ ప్రోగ్రాంలో ఆమిర్, కోహ్లీ
- కోహ్లీతో చాలా సరదాగా పాల్గొన్నానన్న ఆమిర్
- కోహ్లీపై ప్రశంసలు
దీపావళి సందర్భంగా హిందీ ఛానెల్ జీ టీవీలో ప్రసారం కానున్న ఓ ప్రోగ్రాంలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమోను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచిన ఆమిర్ ఖాన్.. కోహ్లీతో కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సరదాగా ఉందని అన్నారు. కోహ్లీ ముక్కు సూటి మనిషని, ఎంతో కూల్ గా ఉంటాడని అన్నారు.
కోహ్లీ మంచి డ్యాన్సర్ అని ఆమిర్ కితాబిచ్చారు. కాగా, కోహ్లీ కోరిక మేరకు నిన్న టీ20 మ్యాచ్ చూడడం కోసం ఆమిర్ భాగ్యనగరానికి వచ్చాడు. అయితే, ఆ మ్యాచ్ వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. ఆమిర్ ఖాన్ పోస్ట్ చేసిన వీడియోలో కోహ్లీ డ్యాన్స్ ని కూడా చూడొచ్చు.