ys jagan: వర్మ తీయాల్సింది 'జగన్ 420' సినిమా: మంత్రి జవహర్

  • జగన్ చెప్పేదంతా ఓ మాయ
  • పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అల్లర్లను ప్రేరేపిస్తారో!
  • జగన్ కబుర్లు ఓ మాయ అన్న మంత్రి 

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి జవహర్ మండిపడ్డారు. మాట తప్పను, మడమ తిప్పను అంటూ జగన్ చెబుతుంటారని... అదంతా ఓ మాయ అని అన్నారు. పాదయాత్రను ఎందుకు చేయబోతున్నారో జగన్ కే స్పష్టతలేదని ఎద్దేవా చేశారు. ఆయన చేయబోయేది పాదయాత్ర కాదని... పాపపరిహార యాత్ర అని తెలిపారు. ఎప్పుడూ ఏదో ఒక అలజడి సృష్టించే జగన్... పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అల్లర్లను ప్రేరేపిస్తారో అని అన్నారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయాల్సింది ఎన్టీఆర్ సినిమా కాదని... 'జగన్ 420' పేరుతో సినిమా తీయాలని అన్నారు.

ys jagan
ys jagan padayatra
ysrcp
minister jawahar
ram gopal varma
jagan 420
  • Loading...

More Telugu News