astronauts: అంతరిక్షంలో ఫిడ్జెట్ స్పిన్నర్... ఎలా తిరుగుతుందో తెలుసా?... వీడియో చూడండి!
- ఎంతసేపు తిరుగుతుందో చెప్పలేమంటున్న ఆస్ట్రోనాట్స్
- ఐఎస్ఎస్ ఫిడ్జెట్ స్పిన్నర్‌తో ఆడుకున్న వ్యోమగాములు
- వీడియో పోస్ట్ చేసిన ఆస్ట్రోనాట్ ర్యాండీ బ్రెస్నిక్
ఇటీవల ఫిడ్జెట్ స్పిన్నర్ పేరుతో ఓ ఆట వస్తువు మార్కెట్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మార్కెట్లో విడుదలైన కొన్ని రోజుల్లోనే ఫిడ్జెట్ స్పిన్నర్ ఓ ట్రెండ్‌లాగ మారిపోయింది. పిల్లలు, యువత, సెలబ్రెటీలు ఇలా అందరి చేతుల్లోనూ కనిపించింది. గిర్రున తిప్పుతూ కాలక్షేపం కోసం ఉపయోగించే ఈ ఆట వస్తువు అంతరిక్షంలో ఎలా తిరుగుతుందో తెలుసా?... ఆ ప్రయోగమే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు చేశారు.
ఫిడ్జెట్ స్పిన్నర్ ను తిప్పుతూ ఆడుకున్నారు. అంతరిక్షంలో దాన్ని అలా తిప్పి వదిలిపెడితే ఎంతసేపు అది తిరుగుతూ ఉంటుందో చెప్పలేమని వ్యోమగామి ర్యాండీ బ్రెస్నిక్ తెలిపారు. ఫిడ్జెట్ స్పిన్నర్ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. న్యూటన్ సిద్ధాంతాలతో ఆడుకోవడం భలే సరదగా ఉందంటూ ఆయన పోస్ట్ పెట్టారు.