parital ravi: పరిటాల సునీత పాత్రను పోషించనున్న రమ్యకృష్ణ?

  • నారా రోహిత్ కథానాయకుడిగా 'బాలకృష్ణుడు' చిత్రం
  • పరిటాల రవి స్ఫూర్తితో తెరకెక్కుతున్న సినిమా
  • రవి భార్య పాత్రలో రమ్యకృష్ణ

శివగామి పాత్రలో సత్తా చాటిన రమ్యకృష్ణ ఇప్పుడు మరో పవర్ ఫుల్ పాత్రను పోషించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఏపీ మంత్రి పరిటాల సునీత పాత్రను ఆమె పోషించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇది బయోపిక్ సినిమాలో కాదు. నారా రోహిత్ కథానాయకుడిగా 'బాలకృష్ణుడు' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరిటాల రవి జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని రాసిన కల్పిత కథతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవి భార్యగా రమ్యకృష్ణ నటించనున్నారని ఫిలింనగర్ టాక్. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

parital ravi
paritala sunitha
ramya krishna
tollywood
nara rohit
balakrishnudu movie
  • Loading...

More Telugu News