aamir khan: ప్రభాస్ పై పొగడ్తలు కురిపించిన ఆమిర్ ఖాన్

  • బాహుబలి-2 ఇంతవరకు చూడలేదు
  • బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో సినిమా చూసి తెలుసుకుంటా
  • మహాభారతంలో కర్ణుడి క్యారెక్టర్ అంటే ఇష్టం

తాను ఇంతవరకు 'బాహుబలి-2' సినిమాను చూడలేదని బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. 'బాహుబలి-1' చిత్రాన్ని చూశానని... ఆ సినిమాను దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారని కితాబిచ్చారు. ప్రభాస్ నటన అత్యద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఎవరైనా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పబోతే... చెప్పవద్దని తాను వారిస్తుంటానని తెలిపారు. స్వయంగా సినిమా చూసే ఈ విషయాన్ని తెలుసుకుంటానని చెప్పారు. రాజమౌళి మహాభారతం తీస్తారో, తీయరో తనకు తెలియదని... తనకు మాత్రం మహాభారతాన్ని తెరకెక్కించాలనేది ఒక డ్రీమ్ అని తెలిపారు. తన కల ఎప్పుడు సాకారమవుతుందో తెలియదని అన్నారు. మహాభారతంలో కర్ణుడి క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని తెలిపారు. బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పందించారు. 

aamir khan
bahubali
mahabharatam
prabhas
ss rajamouli
  • Loading...

More Telugu News